
భార్యాభర్తల బంధం అపురూపమైంది. దాంపత్య జీవితంలో ఆలూమగల మధ్య గొడవలు సర్వసాధారణం. చిన్న చిన్న చికాకులు లేని దంపతులు ఉండటం చాలా అరుదు. భార్యాభర్తలన్నాక అవసరాన్ని, సందర్భాన్ని బట్టి సర్దుకుపోవాలి. కానీ.. కొంత మంది మాత్రం అనాలోచితంగా ప్రవర్తిస్తూ చిన్న చిన్న వాటికే మనస్తాపానికి గురవుతున్నారు. క్షణికావేశంలో ప్రాణాలు తీసుకుంటున్నారు. తాజాగా భర్త... సోషల్ మీడియా ప్లాట్ ఫాం ..ఇన్ స్ట్రాగ్రామ్ వాడొద్దన్నందుకు ... భార్య మనస్తాపానికి గురై ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది.
భర్తతో జరిగిన గొడవ కారణంగా మనస్తాపం చెందిన ఓ వివాహిత (ఇద్దరు పిల్లల తల్లి ) ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఉత్తరప్రదేశ్లోని నోయిడాలో చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం .. బలవన్మరణానికి పాల్పడిన మహిళకు తొమ్మిదేళ్ల కిందట వివాహమైంది. వీరికి ఇద్దరు ఉన్నారు. ఇన్ స్ట్రాగ్రామ్ వాడకంపై భార్యభర్తల మధ్య వాగ్వాదం జరిగింది. ఈ వివాదం తీవ్రరూపం దాల్చడంతో భార్య షాకింగ్ నిర్ణయం తీసుకుంది. దీంతో ఆమె ఇంట్లోకి వెళ్లి ఫ్యాన్ క ఉరేసుకొని మరణించింది ఆ మహిళ నోయిడాలోని సెక్టార్ 39 పోలీస్ స్టేషన్ పరిధిలో సదర్ పూర్ కాలనీలో నివసిస్తుంది. . విషయం తెలుసుకున్న స్థానిక పోలీసు సిబ్బందితో ఘటనాస్థలికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు . మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించి చట్టపరమైన చర్యలు చేపడుతామని పోలీసులు తెలిపారు.